: దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయి: షిండే


దేశంలో తీవ్రవాద దాడులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. హైదరాబాద్ జంట బాంబు పేలుళ్లపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన కేంద్రప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందని సమర్థించుకున్నారు. 2008 సంవత్సరంలో దేశంలో 11 సార్లు తీవ్రవాదులు దాడి చేశారని, 2011కి వీటి సంఖ్య 5కు తగ్గిందని, అదే 2012 సంవత్సరంలో అయితే కేవలం రెండే దాడులు జరిగాయని షిండే తెలిపారు. ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పట్టడానికి కేంద్ర రక్షణ వ్యవస్థ సమర్థంగా పనిచేయడమే కారణమని ఆయన అన్నారు. తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని షిండే పునరుద్ఘాటించారు. 

మరోవైపు సంఘటనా స్థలాన్ని వీఐపీలు సందర్శించకుండా ఉండాలని... అప్పుడే విచారణ జరిపేందుకు పోలీసులకు వీలు కలుగుతుందని షిండే అన్నారు. లేకుంటే వీఐపీల భద్రతతో పోలీసుల విచారణ ఆలస్యమౌతుందని ఆయన చెప్పారు. అందుకే శాంతిభద్రతల కారణంగానే తాను సంఘటనా స్థలానికి రాలేదని రాజ్యసభలో షిండే తెలిపారు. 

  • Loading...

More Telugu News