: ఆ మూడు పట్టణాల్లో ఏదో ఒకటి రాజధాని అవుతుంది: దిగ్విజయ్
ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో మిన్నంటుతున్న ఆగ్రహావేశాలను చల్లబరిచేందుకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ యత్నిస్తున్నారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రకు కొత్త రాజధానిగా గుంటూరు, ఒంగోలు, కర్నూలు పట్టణాల్లో ఏదో ఒక దానిని త్వరలోనే తేలుస్తామని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రుల కష్టనష్టాలను బిల్లులో పొందుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.