: జైలు అధికారులకు సాయపడుతున్న సంజయ్ దత్
సంజయ్ దత్ మంచి నటుడే కాదు, బాగా చదువుకున్న వ్యక్తి కూడా. దాంతో, రెండు నెలల నుంచి పుణేలోని ఎరవాడ జైలులో ఉంటున్న సంజయ్ తన తోటి ఖైదీలకు, జైలు అధికారులకు తనదైన సహయం చేస్తున్నాడు. దరఖాస్తుల పరిశీలన, ఇతర ఆఫీసు పనుల్లో జైలు అధికారులకు సహాయపడుతున్నాడు. మరోవైపు భార్య మాన్యతకు, స్నేహితులకు ఉత్తరాలు రాస్తూ బిజీగా గడుపుతున్నాడు. కొన్నిరోజుల కిందటే స్నేహితుడు, దర్శకుడు రోహిత్ శెట్టీకి ఓ లేఖ రాశాడు. ఈ మధ్యనే సంజూ జైల్లో తన పుట్టినరోజును కూడా జరుపుకున్నాడు.