: అనంతపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత


సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో విద్యుత్ ఉద్యోగులు, జీవిత భీమా ఉద్యోగులు, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని వీధుల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం శివార్లలోని గ్యారేజీలో ఉన్న రెండు ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారు. ప్రైవేటు హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులను కూడా పోలీసులు ఇంటికి పంపించివేశారు. అయినప్పటికీ పలువురు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News