: మతం ముసుగులో వైయస్ అల్లుడి అక్రమ సంపాదన: బీజేపీ
మతం ముసుగులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ వేలకోట్ల రూపాయలు సంపాదించారని బీజేపీ రాష్ట్ర నేత ప్రభాకర్ ఆరోపించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా వుండగా అనిల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. 11 కంపెనీల్లో వందల కోట్ల రూపాయలను అనిల్ పెట్టుబడిగా పెట్టారని వెల్లడించారు.
అనిల్ భార్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల 6 కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. జగన్ అక్రమ ఆస్తుల వలే వీరి అక్రమ సంపాదనపై కూడా సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అనిల్ మత సంస్థకు హైదరాబాద్ చుట్టుపక్కల కేటాయించిన భూములను రద్దు చేయాలని కోరారు. బ్రదర్ అనిల్, షర్మిల అక్రమ సంపాదనపై బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రభాకర్ సవాల్ విసిరారు.