: టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా
సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసిన శాసనసభ్యుల జాబితాలో కృష్ణాజిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కూడా చేరారు. టీడీపీకి చెందిన వెంకటరమణ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు పంపినట్టు తెలిపారు.