: మోడీకి అద్వానీ ప్రశంసలు


బీజేపీ తరుఫున ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుడిగా ఉన్న నరేంద్ర మోడీని సీనియర్ నేత అద్వానీ ప్రశంసించారు. మోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్.. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉత్తమ పాలన అందించారని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ పాలనాంశంతోనే బీజేపీ ప్రజల ముందుకు వెళుతుందన్నారు. మోడీ అయినా లేదా శివరాజ్ సింగ్ లేదా రమణ్ సింగ్ అయినా ఉత్తమ పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఒకరి ప్రభుత్వంతో మరో ప్రభుత్వానికి పోలిక లేదన్నారు. నరేంద్ర మోడీకి బీజేపీ ఎన్నికల ప్రచార సారథి కిరీటం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అద్వానీ లోగడ రాజీనామా చేయడం, తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఈ ఇద్దరు నేతల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నాటి పరిణామాల తర్వాత అద్వానీ, మోడీని మెచ్చుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. దీంతో, వీరి మధ్య మళ్లీ సాన్నిహిత్యం పెరగడానికి మార్గం సుగమమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News