: లగడపాటి సహా ఆరుగురు కాంగ్రెస్ ఎంపీల రాజీనామా
రాష్ట్ర విభజనకు నిరసనగా ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కేవీపీ రామచంద్రరావు, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్ రాజీనామా చేశారు. ఈ ఆరుగురు తమ రాజీనామాలను లోక్ సభ స్పీకర్ కు అందజేయనున్నారు. వెంటనే తమ అధినేత్రి సోనియాగాంధీను కలిసి సమైక్యవాదాన్ని వినిపించాలని వారు నిర్ణయించారు.