: ప్రమాదకరస్థాయిలో గోదావరి ప్రవాహం
మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరదనీరు వస్తుండడంతో వరంగల్, ఖమ్మం జిల్లాలలో ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా రామన్నగూడెం వద్ద గోదావరి నీటిమట్టం 11.6 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. దీంతో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 50 కుటుంబాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 57 అడుగులకు చేరుకుంది. చింతూరు మార్గంలో రహదారిపైకి వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. కూనవరం, భధ్రాచలం మార్గంలో వరదనీరు రహదారులపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.