: లవ్‌హార్మోన్‌కు ఆడా`మగా తేడా తెలుసా?


మనలో ఉత్పన్నం అయ్యే హార్మోన్లలో ఆక్సిటోసిన్‌ను లవ్‌ హార్మోన్‌గా అభివర్ణిస్తారు. అయితే తాజాగా అధ్యయనాలు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే.. ఈ లవ్‌ హార్మోన్‌ ఆక్సిటోసిన్‌.. ఆడా మగా వ్యక్తులపై విడివిడిగా ప్రభావం చూపిస్తుందిట. ఎలాగంటే.. పురుషుల్లో తమ పోటీదారుల్ని గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతుందిట. అదే సమయంలో స్త్రీలలో ఆప్యాయతానురాగాలను, అనుబంధాల్ని చక్కగా అర్థం చేసుకునే విచక్షణను పెంచుతుందిట.

మామూలుగా మహిళలు ఆప్యాయంగా ఉండడానికి, ప్రేమపూరితంగా ఉండడానికి కారణం ఈ హార్మోనేనట.పురుషుల్లో ఇది పోటీ తత్వాన్ని పెంచుతుందిట. సామాజిక సంబంధాల్లో అనుకూల పరిస్థితి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుందనేది అధ్యయనంలోని మరో ఫలితం.

ఆడా మగా తేడా తెలిసి వ్యవహరించే హార్మోను అంటే తమాషాగా ఉంటోంది కదా!

  • Loading...

More Telugu News