: సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రుల భేటీలో రాజీనామాకే నిర్ణయం


ఢిల్లీలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో నిన్నరాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన సమావేశంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామా నిర్ణయానికే మొగ్గు చూపారు. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హల్లో స్పీకర్ కు, స్పీకర్ నమూనాలో రాజీనామా లేఖలు సమర్పించనున్నారు. అయితే మంత్రులు రాజీనామా నిర్ణయానికి వచ్చినా, తమకు పదవులు ఇచ్చిన అధిష్ఠానానికి చివరిసారిగా తమ అభిప్రాయాన్ని తెలియజేసి తుది నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎంపీలు, కేంద్రమంత్రుల సమావేశానంతరం రాత్రి ఒంటి గంట సమయంలో మీడియా ముందు ఎంపీలు ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం 7 మంది ఎంపీలు, నలుగురు కేంద్రమంత్రులు రాజీనామా చేయనున్నారు.

  • Loading...

More Telugu News