: పసిపిల్లల పెరుగుదలపై పరిశుభ్రత ప్రభావం
పిల్లలు బాగా ఎత్తుగా పెరగడం అనేది వారు పసితనంలో పాటించే లేదా వారిని ఉంచే పరిశుభ్రమైన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ అధ్యయన వేత్తలు చెబుతున్నారు. రోజూ ఇంట్లో తాగే మంచినీరు , చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది.. వారు ఎత్తుపెరగడంపై ప్రభావం చూపిస్తాయిట.
పరిశోధకులు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, నైజీరియా, చిలీ తదితర 14 పేద, మధ్యతరగతి దేశాల్లోని సుమారు 10 వేల మంది పిల్లలపై పరిశోదనలు చేశారుట. స్వచ్ఛమైన నీరు, చేతుల పరిశుభ్రత అంతా బాగుంటే.. పిల్లలు బాగా పెరుగుతున్నట్లు గుర్తించామని డాక్టర్ అలన్ డాంగౌర్ చెప్పారు. వీటివల్ల ఎదుగుదల లేమి అరికట్టవచ్చని అంటున్నారు.