: మెదడుకు ఆక్సిజన్‌ ఇవ్వకుంటే గజిని అవుతారంతే


శరీరం జీవించి ఉండాలంటే.. ప్రాణవాయువు ఎంత అవసరమో.. మెదడు సజావుగా పనిచేయాలన్నా కూడా.. దానికి కూడా ఆక్సిజన్‌ అంతే అవసరంట. అయితే రక్తహీనత మూలంగా.. మెదడుకు సరఫరా కావాల్సిన ఆక్సిజన్‌ మోతాదుల్లో తేడా వస్తే గనుక.. అలాంటి వారిలో.. డిమెన్షియా అనే ఒక రకమైన మతిమరపు వ్యాధి వస్తుంది. అమెరికాలోని పరిశోధకులు 2552 మంది వృద్ధులను 11 ఏళ్ల పాటు పరిశీలించి ఈ వివరాలను నిగ్గు తేల్చారు.

రక్తహీనత ఉన్న 445 మంది డిమెన్షియా బారిన పడ్డారట. రక్తహీనత అంటే ఆరోగ్యం సరిగా లేదనడానికి సూచిక. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్‌ మోతాదులు కూడా తగ్గుతాయి. డిమెన్షియా ఇదే కారణం అని పరిశోధకులు అనుకుంటున్నారు. మెదడుకు ఆక్సిజన్‌ అందకపోతే.. జ్ఞాపకశక్తి తగ్గుతుందని, దానివల్ల నాడులు కూడా దెబ్బతినవచ్చునని కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ క్రిస్టయిన్‌ యఫే తెలిపారు.

  • Loading...

More Telugu News