: ఫోను వాడడానికి ఒక ‘ఫింగర్‌’ కొనుక్కోండి


ప్రపంచంలో జీవనం మరీ సునాయాసం అయిపోయాక ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లు వచ్చేశాయి. ఎంచక్కా.. వేలితో అలా టచ్‌ చేస్తే చాలు, పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని జీవితాలను ఇంతకంటె సునాయాసంగా మార్చేయాలని బ్రిటన్‌కు చెందిన సాంకేతిక నిపుణులకు ఒక ఆలోచన వచ్చింది. అదే తడవుగా.. స్మార్ట్‌ ఫోను మీద వాడి వాడి మీ చేతి వేళ్లు నొప్పెట్టకుండా.. ఒక కృత్రిమ వేలు వంటి దానిని కనుగొన్నారు. దీనికి థంబెల్‌ అని పేరు పెట్టారు. ఇది చూడడానికి డంబెల్‌ లాగా ఉండే కృత్రిమ వేలుట!

నిత్యం వెబ్‌ అవసరం ఉండేవారు, స్మార్ట్‌ఫోనులో యాక్టివిటీ ఎక్కువగా ఉండేవారికి.. ఈ థంబెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని వారంటున్నారు. కానీ ఇలాంటివన్నీ వాడితే అసలు మన శరీరంలో మనం స్వతంత్రంగా వాడుకోవడానికి ఏం ఉంటాయా? అని కొందరు ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News