: 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామా


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 11 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాష్ట్ర శాసనసభ కార్యాలయానికి చేరుకున్న వీరు శాసనసభ కార్యదర్శికి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. రాజీనామాలు చేసినవారిలో జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, వెంకట్రామయ్య, సుధాకర్, మురళీకృష్ణ, ఉగ్రనరసింహారెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, కారుమూరి నాగేశ్వర్రావు, ఉషారాణి, రామాంజనేయులు ఉన్నారు. కాగా ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, గాదె శ్రీనివాసులు నాయుడు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇవి ఉత్తుత్తి రాజీనామాలు కాదని, చిత్తశుద్దితోనే రాజీనామాలు చేస్తున్నామని జేసీ పేర్కొన్నారు. స్పీకర్ లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖలు ఇచ్చినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News