: కర్నూలులో టీజీ హోటల్ కు తగిలిన విభజన చిచ్చు
విభజన చిచ్చు మంత్రి టీజీ వెంకటేశ్ హోటల్ కు తగిలింది. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని తప్పుపడుతూ కర్నూలులో సమైక్యవాదులు టీజీ వెంకటేశ్ కు చెందిన మౌర్య ఇన్ హోటల్ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు నాటకాలాడుతున్నారని, విభజించిందీ వారే, ఉద్యమాలు చేసేదీ వారేనని ఆందోళనకారులు ఆగ్రహంతో నినాదాలు చేశారు. పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ వారు తమ సచ్ఛీలతను చాటుకోవాలని కోరారు.