: ఈనెల 4 నుంచి హైదరాబాదులో బార్లు బంద్
హైదరాబాదులో జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా నగర కమిషనర్ అనురాగ్ శర్మ ఆంక్షలు విధించారు. ఈనెల 4 నుంచి 6 వరకు నగరంలోని బార్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రిజిస్టర్డ్ క్లబ్బులు, స్టార్ హోటళ్లలో నిర్వహిస్తున్న బార్లకు మినహాయింపునిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.