: సీమాంధ్ర ప్రజల మనోభావాల ప్రకారమే రాజీనామాలు: గాదె
సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తున్నామని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ ఇవ్వడమే రాష్ట్రవిభజనకు దారితీసిందని అన్నారు. తాము స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేస్తున్నామని అన్నారు.