: ఎవరు నన్ను సస్పెండ్ చేసింది?: విజయశాంతి
తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ వస్తున్న వార్తల పట్ల మెదక్ ఎంపీ విజయశాంతి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, తనను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు లేఖ ఏదీ అందలేదని చెప్పుకొచ్చారు. సస్పెన్షన్ లేఖ అందిన తర్వాతే పూర్తిస్థాయిలో వివరణ ఇస్తానని తెలిపారు. ఆరేళ్ళు టీఆర్ఎస్ లో పనిచేసేందుకు అవకాశమిచ్చిన పార్టీ అధినేత కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం అమరవీరుల త్యాగఫలం అని ఆమె కీర్తించారు. కార్యకర్తలు ఎవరూ ఆగ్రహావేశాలకు లోనుకావద్దని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను అన్ని మీడియా కార్యాలయాలకు పంపారు.