: శోభాడే కు ముంబై రాష్ట్ర వ్యాఖ్యల సెగ
ప్రముఖ రచయిత్రి శోభాడే ఇంటివద్ద శివసేన కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ముంబై కూడా స్వతంత్ర రాష్ట్రం కావచ్చు, అలా అయ్యేందుకు అవకాశాలున్నాయని శోభాడే ట్వీట్ చేశారు. దీంతో, మహరాష్ట్రలో దుమారం రేగింది. తాము సమైక్య మహారాష్ట్ర గురించి మాట్లాడుతుంటే, ఆమె ప్రత్యేక ముంబై గురించి వ్యాఖ్యానించడమేంటని శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె క్షమాపణలు చెప్పాలంటూ పట్టుపట్టారు. తాను హానికరంకాని రీతిలో సరదాగా వ్యాఖ్యలు చేశానని, ముంబైని విడదీయమనలేదని ఆమె అన్నారు. ఆ మాత్రం భావప్రకటన స్వేచ్ఛ ఉందని, క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని శోభాడే స్పష్టం చేశారు.