: కాంగ్రెస్ పై టీడీపీ నేతల ఆగ్రహం


రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికార కాంగ్రెస్, టీడీపీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ సాయంత్రం టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. సోమిరెడ్డి మాట్లాడుతూ, సీడబ్ల్యూసీలో ప్రకటన చేసే ముందు అన్ని ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందని హితవు పలికారు. ఇతర పార్టీలవారిపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు నీళ్ళ కోసం, రాజధాని కోసం పోరాడతారా.. లేక పార్టీకి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

గాలి మాట్లాడుతూ, టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. 2004లో తెలంగాణ ఎమ్మెల్యేలను ఉసిగొల్పి ఫోరం ఏర్పాటు చేయించి ఉద్యమాన్ని ఎగదోసింది వైఎస్ కాదా? అని ప్రశ్నించారు. అప్పట్లో 40 మంది ఎమ్మెల్యేలతో వైఎస్ సంతకాలు సేకరించారని తెలిపారు. తాజాగా, సీడబ్ల్యూసీ ప్రకటనను ముందు వైఎస్సార్సీపీకి లీక్ చేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News