: 'టైమ్ పాస్ నేతల క్లబ్బు'లోకి ఉమా భారతికి దిగ్విజయ్ ఆహ్వానం
'టైమ్ పాస్ రాజకీయ నేతల క్లబ్బు'లోకి బీజేపీ నేత ఉమా భారతి చేరవచ్చంటూ ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆహ్వానించారు. ద్విగ్విజయ్, బీజేపీ నేత శత్రుఘ్నసిన్హా రాజకీయాలను సీరియస్ గా తీసుకోవడం లేదంటూ కొన్ని రోజుల కిందట ఉమా భారతి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై భోపాల్ లో ఈ రోజు స్పందించిన దిగ్విజయ్ పై విధంగా మాట్లాడారు. తాను, శత్రుఘ్నసిన్హా అంత సీరియస్ రాజకీయ నేతలు కాదని అనుకుంటే ఆమెను కూడా తమ క్లబ్బులోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.