: సీమాంధ్ర ఉద్యమం మాకు తెలుసు: షిండే


ఆంధ్రప్రదేశ్ ను విభజన చేయాలని కాంగ్రెస్ పార్టీ నోట్ పంపిందని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు. హోం మంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్న షిండే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ విభజన తరువాత పలు డిమాండ్లు ఊపందుకున్నాయని తెలిపారు. అయితే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు జరుపుకోవచ్చని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లోనే చట్టబద్దంగా తెలంగాణ ఏర్పడుతుందని అన్నారు. విదర్భకంటే ముందే తెలంగాణ డిమాండ్ ఉందని అన్నారు. యూపీలో 4, ఈశాన్య రాష్ట్రాల్లో మరో 5 ప్రాంతాల డిమాండ్లు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదిక భాష కాదని షిండే అన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయించినట్టే 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రెండు ప్రాంతాలకు రాజధానిగా ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News