: బ్యాంకు, ఏటీఎం, బస్సుల అద్దాలు పగులగొట్టిన ఉద్యమకారులు
సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయనేతల నిర్ణయానికి ప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు బ్యాంకు, ఏటీఎం, ప్రైవేటు బ్యాంకుల అద్దాలను, ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ వద్ద న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.