: బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్న మోపిదేవి
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సీబీఐ కోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. కొన్నాళ్ల నుంచి అనారోగ్యం కారణంగా బాధపడుతున్న తనకు మూడు నెలల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గతంలో మోపిదేవి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయినా కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో చివరికి వెనక్కి తీసుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మంత్రి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండు ఖైదీగా ఉంటున్నారు.