: ఆన్ లైన్ సెర్చింగ్ లో సల్మాన్ ఖాన్ టాప్ ప్లేస్
ఆన్ లైన్ సెర్చింగ్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దూసుకుపోతున్నాడు. అత్యంత ఎక్కువగా నెటిజన్లు వెదికే భారత సెలబ్రిటీల్లో తన స్టైల్, ఛరిష్మాతో మోస్ట్ డిజైరబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ తొలిస్థానంలో నిలిచాడు. ఉక్లిప్ అనే సంస్థ నిర్వహించిన రెండవ త్రైమాసిక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. మోడల్స్, హీరోయిన్లు, క్రికెటర్స్, గాయకులను వెనక్కునెట్టి మరీ సల్మాన్ ఈ స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ సర్వేలో చూస్తే ఇండోనేషియా ప్రసిద్ధ నటి అయు అజహరీ తర్వాత రెండవ స్థానంలో సల్మానే ఉండటం విశేషం. ఇక ఈ సర్వేలో భారతీయ సెలబ్రిటీలు వరసగా రెండవ స్థానంలో కత్రినా కైఫ్, మూడో స్థానంలో సచిన్ టెండూల్కర్, అనుష్క (5), కాజల్ అగర్వాల్ (9), నిత్యా మీనన్ (10)స్థానాల్లో ఉన్నారు.