: సెప్టెంబర్ లో 'గంగ్నమ్ స్టైల్' ఫేమ్ 'సై' కొత్త ఆల్బమ్


'గంగ్నమ్ స్టైల్' అంటూ తన విభిన్నశైలి పాటతో ప్రపంచాన్ని ఊర్రూతలూగించిన పాప్యులర్ దక్షిణ కొరియా గాయకుడు సై సెప్టెంబర్లో కొత్త ఆల్బమ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికోసం మూడు పాటలను పూర్తి చేశానని, వినసొంపుగా ఉంటాయని ట్విట్టర్ లో వెల్లడించాడు. మరోవైపు దీనిపై సై ఏజెంట్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పేరుపెట్టని ఓ ఆల్బమ్ కోసం సై లాస్ ఏంజిల్స్ లో కసరత్తులు చేస్తున్నట్టు తెలిపాడు. సంవత్సరం క్రితం విడుదలైన సై 'గంగ్నమ్ స్టైల్' ఆల్బమ్ అంతర్జాతీయంగా మంచి ఫేమ్ సంపాదించింది. యూట్యూబ్ లో ఈ వీడియో 1.7 బిలియన్ వీక్షకుల ఆదరణ పొందింది. అనంతరం రిలీజైన మరో సింగిల్ 'జెంటిల్మన్' కూడా అదే రీతిలో ప్రభంజనం సృష్టించింది.

  • Loading...

More Telugu News