: హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించండి: సీమాంధ్ర ఉద్యోగులు
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ హక్కులు కాలరాస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించిందని సీమాంధ్ర ఉద్యోగులు మండిపడ్డారు. తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని అందుకు అనుగుణంగా ఈ సాయంత్రం తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.