: రాజీనామా చేస్తున్నాం: సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు
సీమాంధ్ర మంత్రుల సమావేశం ముగిసింది. హైదరాబాదులో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశమైన మంత్రులు, ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. సీమాంధ్రలో ఇప్పటివరకూ పార్టీల నేతలంతా ఒకవైపు, ప్రజలంతా మరొకవైపు ఉన్నారని అన్నారు. నిన్నటివరకు పంచాయతీ ఎన్నికలు ఉండడంతో అధిష్ఠానాన్ని ఇబ్బంది పెట్టకూడదని ఇంతవరకూ ఆగామని తెలిపారు. తక్షణం రాజీనామాలు చేసి తమ తమ ప్రాంతాల్లో ఉద్యమంలో దిగేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రులు, ఎమ్మెల్యేల తరపున టీజీ వెంకటేశ్, జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.