: ఢిల్లీలో బాంబు భయం: సూట్ కేసులతో పరేషాన్


హైదరాబాదులో బాంబు దాడి ఘటన నుంచి పూర్తిగా తేరుకోక ముందే దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం చెలరేగింది. ఢిల్లీలోని బాబూ రాజేంద్రప్రసాద్ రహదారిలో రెండు సూట్ కేసులు రో్డ్డుపై పడి  ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కీలకమైన పార్లమెంట్, ఏపీ భవన్ ల మధ్యలో ఈ సూట్ కేసులుండటంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న బాంబు నిర్వీర్య సిబ్బంది వాటిని తనిఖీ చేయగా, కొన్ని దుస్తులు బయటపడ్డాయి. దాంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News