: ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తీసుకురండి: సుష్మ డిమాండ్


పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోనే తెలంగాణ బిల్లును తీసుకురావాలని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. ఈ నెల 5 నుంచి పార్లమెంటు సమవేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సుష్మ ప్రధానంగా తెలంగాణ అంశాన్ని లేవనెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదించినందున, ప్రత్యేక తెలంగాణ బిల్లును ఈ సమావేశాలలోనే సభలో ప్రవేశపెట్టాలని ప్రధానిని కోరారు. బిల్లుకు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News