: పీవీ రంగారావుకు సీఎం కిరణ్ నివాళి
ఈ ఉదయం కన్నుమూసిన మాజీ మంత్రి పీవీ రంగారావు భౌతికకాయానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. సీఎంతో పాటు స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూడా పీవీ రంగారావుకు నివాళులర్పించారు.