: తోకలు ముడిచిన సఫారీలు


అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం అనంతరం శ్రీలంకలో ఓ వన్డే సిరీస్ గెలవాలన్న దక్షిణాఫ్రికా కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. తాజాగా, ఐదు వన్డేల సిరీస్ లో సఫారీలు 1-4తో ఓటమిపాలయ్యారు. నిన్న కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో శ్రీలంక 128 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంకేయులు 50 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలో దిగిన పర్యాటక జట్టు 179 పరుగులకే చాపచుట్టేసింది. లంక బౌలర్లలో లక్మల్, మెండిస్ చెరో 3 వికెట్లు తీయగా, సేనానాయకే 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో 99 పరుగులు చేసిన డాషింగ్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'.. సిరీస్ లో పరుగులు వెల్లువెత్తించిన కుమార్ సంగక్కర కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' దక్కాయి. సంగా 5 మ్యాచ్ లలో 93 సగటుతో 372 పరుగులు చేశాడు. వాటిలో 1 సెంచరీ, 2 ఫిఫ్టీలున్నాయి.

  • Loading...

More Telugu News