: డీఎస్పీ హత్య కేసులో రాజాభయ్యాకు క్లీన్ చిట్
ఉత్తరప్రదేశ్ లోని కుందా డీఎస్పీ జియా ఉల్ హక్ హత్య కేసులో యూపీ మాజీ మంత్రి రాజా భయ్యాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ హత్యతో అతడికి ఎలాంటి సంబంధంలేదని చెప్పింది. మార్చి 2న ప్రతాప్ గఢ్ జిల్లాలోని కుందా ప్రాంతానికి దగ్గరలో ఉన్న బలిపూర్ గ్రామ సర్పంచ్ యన్హే యాదవ్ హత్య జరిగింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన జియా ఉల్ హక్ తో పాటు మరో ఇద్దరు హత్యకు గురయ్యారు.
సంచలనం సృష్టించిన ఈ ఘటనలో తన భర్త హక్ ను రాజా భయ్యానే చంపించారంటూ అతని భార్య పర్వీన్ అజాద్ ఆరోపించారు. దాంతో, మంత్రిపై పొలీసులు కేసు నమోదు చేయడంతో యూపీ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తులో మంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పుడే రాజాభయ్యా మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు.