: ఎన్టీఆర్ సమాధి వద్ద కంటతడి పెట్టిన లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ సమాధి వద్ద లక్ష్మీపార్వతి కంటతడి పెట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం పట్ల ఆమె తీవ్ర భావోద్వేగాలకు గురైనట్టు కనిపించారు. తెలుగుజాతి రెండు ముక్కలవడానికి రాజకీయ పార్టీల ఉదాసీన వైఖరే కారణమని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. ఎన్టీఆర్ సమాధి వద్ద ఆమె ఈ ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.