: మా దేశంలో అల్ ఖైదా ఉగ్రవాదులు: న్యూజిలాండ్ పీఎం


శిక్షణ పొందిన అల్ ఖైదా ఉగ్రవాదులు తమ దేశంలో ఉన్నారని న్యూజిలాండ్ ప్రధాని జాన్ కే వెల్లడించారు. అటువంటి వారిపై నిఘా వేసి ఉంచుతామన్నారు. ప్రస్తుతం సొంత పౌరులపై నిఘాకు చట్టాలు అనుమతించడం లేదు. దీంతో ఇందుకు అవకాశం కల్పించే బిల్లుపై చర్చ సందర్భంగా జాన్ మాట్లాడారు. అల్ ఖైదా క్యాంపుల్లో శిక్షణ తీసుకున్న వారు న్యూజిలాండ్ లో ఉన్నారని విస్పష్టంగా చెప్పారు. న్యూజిలాండ్ కు వ్యతిరేకంగా పనిచేస్తూ.. యెమన్ తదితర దేశాల్లోని క్యాంపుల్లో శిక్షణ తీసుకుంటున్న విషయం వాస్తవమేనని, దీన్ని ఎలా ఎదుర్కొంటామన్నదే ముఖ్యమన్నారు.

  • Loading...

More Telugu News