: ఏయూలో ఉద్రిక్తత


విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏయూ అడ్మినిస్ట్రేషన్ భవన్ లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, విద్యార్ధులకు మధ్య తోపులాట జరిగింది. అమరణ దీక్ష రెండో రోజుకు చేరుకోవడంతో భారీ సంఖ్యలో విద్యార్థులు అక్కడికి చేరుకుని దీక్షాపరులకు మద్దతు పలికారు. వారిని అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. విద్యార్ధులు తరగతులు బహిష్కరించి, మానవహారంగా ఏర్పడి తమ నిరసనను తెలిపారు. విద్యార్ధులు వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు పోలీసులకు, విద్యార్ధులు మధ్యకు వాగ్వాదాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News