: టాస్ గెలిచిన టీమిండియా.. పుజారా వన్డే అరంగేట్రం


జింబాబ్వేతో నాలుగో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్ ను ఇప్పటికే 3-0తో గెలుచుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ లో మరికొందరు యువ ఆటగాళ్ళకు అవకాశాలివ్వాలని నిర్ణయించింది. ద్రావిడ్ వారసుడిగా క్రికెట్ పండితుల మన్ననలందుకుంటున్న సౌరాష్ట్ర యువకెరటం చటేశ్వర్ పుజారా ఈ మ్యాచ్ తో వన్డే కెరీర్ ఆరంభించనున్నాడు. ఇక హర్యానా యువ పేసర్ మోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. అప్రాధాన్యపు పోరు కావడంతో టీమిండియా మేనేజ్ మెంట్ తుది జట్టులో వీరిద్దరికి చోటు కల్పించింది. ఈ మ్యాచ్ కు వేదిక బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా నిలవనుంది.

  • Loading...

More Telugu News