: సైకిలే ఛాంపియన్.. కుదేలైన కాంగ్రెస్, జగన్ పార్టీ
పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. మూడో విడత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాస్సేపటి క్రితం పూర్తి కాగా.. అధికార కాంగ్రెస్ తో పాటు, వైఎస్సార్సీపీకి చేదు గుళిక తినిపిస్తూ టీడీపీ అత్యధిక పంచాయతీల్లో తన మద్దతుదారులను గెలిపించుకుంది. మూడు విడతల్లో కలిపి మొత్తం 21233 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ బలపర్చిన సర్పంచి అభ్యర్థులు 6132 మంది జయకేతనం ఎగురవేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ మద్దుతుదారులు 6001 పంచాయతీల్లో నెగ్గారు. వైఎస్సార్సీపీ 3890, టీఆర్ఎస్ 1684, వామపక్షాలు 324, ఇతరులు 3202 సర్పంచి పదవులను కైవసం చేసుకున్నారు.