: రెండోరోజూ సీమాంధ్ర ఉద్రిక్తం.. మంత్రుల ఇళ్ళ ముట్టడి
రాష్ట్ర విభజన రగిల్చిన ఆగ్రహజ్వాలలు సీమాంధ్ర ప్రాంతంలో ఇంకా చల్లారలేదు. బందులు, నిరసనలు, ముట్టడి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కడపలో సమైక్యాంధ్రకు మద్దతుగా నేడూ బంద్ కొనసాగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమైక్యవాదులు మంత్రి రామచంద్రయ్య ఇంటిని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఇక విజయనగరంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. విశాఖలో విద్యాసంస్థలను మూసివేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని విద్యార్థులు, ఉద్యోగులు ముట్టడించి తమ నిరసన తెలియజేశారు. నెల్లూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఏలూరు అగ్నిమాపక దళం ఆఫీసు వద్ద అఖిలపక్షం ధర్నా నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.