: సీమాంధ్రులు సంయమనం పాటించాలి: సీఎం కిరణ్
రాష్ట్ర విభజనతో ఆందోళనలు చేస్తున్న సీమాంధ్రులు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలని డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్లు వాడకుండా ఆందోళనకారుల చర్యలను నియంత్రించాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని నిరసనకారులకు సూచించారు. సచివాలయంలో డీజీపీ, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం పలు విషయాలపై చర్చించారు. భద్రత విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అయితే, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరగడం తనకు మనస్తాపం కలిగించిందని సీఎం పలువురితో అన్నట్లు తెలిసిందే.