: మాజీ మంత్రి పీవీ రంగారావు కన్నుమూత
మాజీ మంత్రి పీవీ రంగారావు(73) ఈ రోజు తెల్లవారు జామున తన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. ఈయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పెద్ద కుమారుడు. పీవీ రంగారావు అవివాహితులుగా ఉండిపోయారు. 20 ఏళ్ల క్రితం గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకొన్నారు. బుధవారం సాయంత్రమే ఆయన ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకొని వచ్చారు. కోట్ల విజయ భాస్కరరెడ్డి మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా రంగారావు పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు.