: షుగరు మందు ఆయుష్షు పెంచుతుందా?
మనకు తెలియకుండానే మనల్ని మరణానికి చేరువగా తీసుకువెళ్లే ప్రమాదకరమైన వ్యాధుల్లో షుగర్ కూడా ఒకటి. అయితే చక్కెర వ్యాధి నివారణకు మనం ఉపయోగించి ఒక మందు మాత్రం జీవన ఆయుర్దాయాన్ని పెంచే అవకాశం ఉన్నదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చక్కెర వ్యాధికి వాడే మెట్‌ఫార్మిన్‌తో ఆయుర్దాయం పెరుగుతుందని తేల్చారు. చిన్న డోసేజీల్లో తీసుకుంటే ఈ ఫలితం ఉంటుందిట. ఎప్పటిలాగా ఈ అధ్యయనం మాత్రం ఎలుకలమీద నిర్వహించి ఫలితాన్ని నిగ్గు తేల్చారు.
ఎలుకలకు కొద్దికొద్దిగా మెట్‌ఫార్మిన్ ఇస్తే.. వాటి జీవితకాలం పెరిగిందని.. వార్ధక్యం వల్ల వచ్చే వ్యాధులు ఆలస్యం అయ్యాయని తేలింది. అదే సమయంలో ఈ మందు ఎక్కువగా ఇస్తే అది విషంలా కూడా పనిచేస్తుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన రాఫెల్ డీకాబో అంటున్నారు.
ప్రపంచంలో మెజారిటీ చక్కెర వ్యాధి టైప్ 2 రోగులు మెట్‌ఫార్మిన్‌ను మందుగా తీసుకుంటున్నారు.