: వయసుతోటే మారుచుండును జిహ్వ కోరికల్‌


క్షణక్షణమున్‌ మారుచుండు జవరాండ్ర చిత్తముల్‌ అని నానుడి. అలాగే వయసుతో పాటు జిహ్వ కోరుకునే రుచులు కూడా మారుతుంటాయిట. జిహ్వ చాపల్యంలో వయసుతో పాటూ స్పష్టమైన మార్పు చోటు చేసుకుంటుందని.. మనిషి ఆహారం, శక్తికి సంబంధించిన అవసరాలు వయసుతో పాటు మారుతాయని.. దానికి తగినట్లుగానే శరీరం కోరుకునేవి... జిహ్వ ఇష్టాయిష్టాలు కూడా మారుతాయని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చారు.

అయితే వీరు ఈ విషయాన్ని కూడా ఎలుకల మీదనే పరిశోధించి ఈ నిర్ణయానికి వచ్చారు. దీనికోసం వీరు వివిధ వయో గ్రూపుల్లో ఉన్న ఎలుకలను తీసుకుని పరిశీలించారు. వాటికి తీపి, ఉప్పు, వగరు, చేదు, పులుపు ఇలా అన్ని రకాల రుచులను చూపించారు. బాగా వయసు మళ్లిన ఎలుకలు తీపి పట్ల మోజు చూపించలేదుట. చేదు ఇష్టపడ్డాయిట. వయసులో ఉన్న ఎలుకలు ఇష్టపడే రుచులు మాత్రం వేరుగా ఉన్నాయి.

ఈ ప్రయోగాలు చేశారు గానీ.. ఇలా ఎందుకు జరుగుతోందనేది మాత్రం ఇప్పటికీ అస్పష్ట వ్యవహారమే అని జపాన్‌ పరిశోధకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News