: పంచాయతీలో సత్తా చాటిన టీడీపీ
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో మొత్తం 21,275 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 5,998 స్థానాలు గెలుచుకుని టీడీపీ అగ్రస్థానం దిశగా సాగుతోంది. 5,854 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. తృతీయ స్థానంలో వైఎస్సార్ సీపీ 3,787 పంచాయతీలను గెలుచుకుని నిలిచింది. 3,138 స్థానాలను గెలుచుకుని వీరి తరువాత స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులు సాధించారు. 1,633 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ ఐదో స్థానంలో నిలిచింది. వామపక్షాలు 310 స్థానాల్లో పాగా వేసి తమ ఉనికిని చాటుకోగా, మరో 555 పంచాయతీల ఫలితాలు వెలువడాల్సిఉంది.