: ఆగస్టు 3 వరకు డార్జిలింగ్ బంద్
గూర్ఖాల్యాండ్ ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. మూడు రోజుల బంద్ కు పిలుపునిచ్చిన గూర్ఖా జనముక్తి మోర్చా తాజాగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన డార్జిలింగ్ లో ఆగస్టు 3 వరకు ఈ బంద్ ను పొడిగించింది. కేవలం 5 దశాబ్దాల ఉద్యమమైన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించగా లేనిది, 107 ఏళ్ల చారిత్రక పోరాటం చేస్తున్న తమకు మాత్రం ఎందుకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించరని గూర్ఖాల్యాండ్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తమకు, పశ్చిమ బెంగాల్ కు సంబంధం లేదని, తాము సిక్కిం, భూటాన్ రాష్ట్రాలకు చెందిన వారమని, కానీ బెంగాల్ వారమంటూ వీరితో కలిపి ఉంచడం సరికాదన్నారు.
అందుకే తమను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఉద్యమ కార్యాచరణ రచిస్తున్నామని గూర్ఖా జనముక్తి మోర్చా తెలిపింది. మూడు రోజుల బంద్ సందర్భంగా ఇక్కడ జనజీవనం స్థంభించింది. మరోవైపు ఉద్యమం మరోసారి ఉగ్రరూపం దాల్చితే ఏం చేయాలనే దానిపై బెంగాల్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.