: అసెంబ్లీకి సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ఎలా విడగొడతారు? : మాజీ ఐపీఎస్


అసెంబ్లీకి సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ఎలా విడగొడతారని మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో విశాంధ్ర మహాసభ సభ్యులు ట్యాంక్ బండ్ పై ఉన్న సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు తాము చివరి వరకూ పోరాడతామని తెలిపారు. తెలుగు ప్రజల అభిప్రాయం లేకుండా, రాష్ట్ర ప్రతినిధులు లేకుండా ఎలా నిర్ణయం వెల్లడిస్తారని నిలదీశారు.

  • Loading...

More Telugu News