: ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయం
సర్పంచ్ ఎన్నికల్లో విచిత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న కృష్ణా జిల్లాలో ఒకే ఇంట్లో 250 ఓట్లు కేటాయించి సంచలనం సృష్టిస్తే, తాజాగా పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించి మరో వింతను బయటపెట్టారు అధికారులు. వివరాల్లోకెళితే విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చోడుపల్లిలో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. దీంతో అదెలా సాధ్యమంటూ వైఎస్సార్ సీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఇదే కాంగ్రెస్ మార్కు రాజకీయమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.