: దక్షిణాఫ్రికాకు స్పిన్ కష్టాలు
కొలంబోలో శ్రీలంకతో ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు కష్టాల్లో పడింది. ఈ 'డే అండ్ నైట్' మ్యాచ్ లో లంక విసిరిన 308 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీలు 13.5 ఓవర్లలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయారు. యువ ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేనానాయకే 9 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను ఇక్కట్లపాల్జేశాడు. దిల్షాన్, పెరెరా చెరో వికెట్ తీశారు. డికాక్ 27, ఆమ్లా 18, డుమినీ 15,, డుప్లెసిస్ 5 పరుగులు చేశారు.