: పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
రూపాయి పతనం ప్రజల నెత్తినపడింది. ఉల్లి, పల్లీ అన్నీ రేట్లు పెరిగి ప్రజల నడ్డివిరగ్గొడుతుంటే తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. కాగా, లీటర్ పెట్రోలుపై 70 పైసలు, లీటర్ డీజిల్ పై 50 పైసల పెంపును ఆమోదిస్తూ పెట్రోలియం కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో ఇప్పడు డీజిల్ ధర తాజా పెంపుతో 56 రూపాయలకు చేరుకుంది. పెట్రోలు లీటర్ 77 రూపాయలు దాటింది. జూలై 15 న రెండున్నర రూపాయలు పెంచిన పెట్రోలియం కంపెనీలు 15 రోజుల వ్యవధిలోనే మరో 70 పైసలు పెంచడం దారుణమని వాహనదారులు మండిపడుతున్నారు. దీంతో, గత మూడు నెలల్లోనే పెట్రోలు ధరలు 10 రూపాయల వరకు పెరగడం విశేషం.